NTV Telugu Site icon

Minister RK Roja: ఆడండి పాడండి ఎంజాయ్ చేయండి.. జగన్‌ మళ్లీ సీఎం కావాలి..

Rk Roja

Rk Roja

Minister RK Roja: ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాక్షించారు మంత్రి ఆర్కే రోజా.. కాకినాడ జిల్లా సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు.. ఇక, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆడండి, పాడండి, ఎంజాయ్ చేయండి అని సూచించారు మంత్రి ఆర్కే రోజా. మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య యూవర్శిటీలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రోగ్రాంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి పాల్గొన్నారు మంత్రి ఆర్కే రోజా.. నన్నయ్య వర్శిటీలో వివిధ ప్రాంతలా ఛాంపియన్ షిప్ విద్యార్థులకు గౌరవ వందనం చేశారు.. నన్నయ్య వాణితో మంత్రిని అలరించారు యూనివర్సిటీ సిబ్బంది. ఇక, ఈ రోజు పాలకొల్లులోనూ మంత్రి రోజా పర్యటించనున్నారు. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న లక్ష దీపోత్సవంలో పాల్గొననున్నారు మంత్రి ఆర్కే రోజా.

Read Also: Geriatrics : జెరియాట్రిక్స్ గురుంచి మీకు తెలుసా ?