NTV Telugu Site icon

AP Elections 2024: ఏపీవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్..

Ap Voters

Ap Voters

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యర్రగొండపాలెంలో కేవలం 5.2 శాతం మేర పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న గురజాల, మాచర్ల, పుంగనూరుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్ జరిగినట్లు తెలిపారు. గురజాల 9.5 శాతం, మాచర్ల 0. 9 శాతం, పుంగనూరులో 15 శాతం మేర పోలింగ్ నమోదు అయిందని ఈసీ పేర్కొనింది.

Read Also: Amit Shah : 2029 తర్వాత కూడా నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి : అమిత్ షా

ఇక, తొలి రెండు గంటల్లో కేవలం 10 శాతం పోలింగ్ నమోదు అయింది. ఏపీ వ్యాప్తంగా జిల్లాల వారిగా పోలింగ్ శాతం ఇదే..!
అల్లూరి- 6.77
అనకాపల్లి-8.37
అనంతపురం- 9.18
అన్నమయ్య- 9.89
బాపట్ల- 11.36
చిత్తూరు- 11.84
కోనసీమ- 10.42
తూర్పు గోదావరి- 8.68
ఏలూరు- 9.90
గుంటూరు- 6.17
కాకినాడ- 7.95
కృష్ణా- 10.80
కర్నూలు- 9.34
కడప- 12.09
నంద్యాల- 10.32
నెల్లూరు- 8.95
పల్నాడు- 8.53
పశ్చిమగోదావరి- 9.57
పార్వతిపురం మన్యం- 6.30
ప్రకాశం- 9.14
శ్రీ సత్యసాయి- 6.92
శ్రీకాకుళం- 8.30
తిరుపతి- 8.11
విశాఖపట్నం- 10.24
విజయనగరం- 8.77