Nellore student suicide: నెల్లూరు జిల్లా అన్నమయ్య సర్కిల్ లో ఉన్న ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని హేమశ్రీ ఉరిసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. కాలేజీ యాజమాన్యమే చంపేసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీ ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల మద్దతు కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆగ్రహానికి గురైన విద్యార్థి సంఘాల నేతలు.. కాలేజీ అద్దాలు ఫర్నిచర్ పగలగొట్టారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి.. ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. వేదాయపాలెం సీఐ శ్రీనివాస్ రావ్ విద్యార్థి సంఘ నేతలపై లాఠీఛార్జ్ చేశారు. నిరసన కారులను అక్కడి నుంచి చెదరగొట్టారు.
READ MORE: Elumalai Movie: ‘ఏలుమలై’ సినిమా నుంచి కొత్త పాట.. ‘కాపాడు దేవా’ అంటున్న మంగ్లీ
కాగా.. మొదట విద్యార్థిని ఆత్మహత్య గురించి గుట్టుచప్పుడు కాలేజీ యాజమాన్యం వ్యవహరించింది. ఎవరికీ అనుమానం రాకుండా.. విద్యార్థినికి ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రికి తరలించింది. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. కుమార్తె ఆరోగ్యంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు. అయితే, విద్యార్థిని మెడ భాగంపై కమిలిన గాయాలు ఉండడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
READ MORE: Air India: కొత్త సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల వరకు.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ రూపురేఖలు మారనున్నాయ్!
