MBBS Student Missing: జార్జియాలో తెలుగు విద్యార్థి అదృశ్యం అయ్యాడు.. ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్థి శిరగం హేమంత్ అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. మెడిసిన్ చదవడానికి జార్జియా వెళ్లిన హేమంత.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.. అయితే, ఈ రోజు జార్జియా నుంచి భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది.. కానీ, ఎలాంటి సమాచారం లేదు.. దానికి తోడు తన రూమ్‌లోనే మొబైల్ ఫోన్ ఉండడంతో హేమంత్ అదృశ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.. తన కుమారుడికి ఏం జరిగిందోనని తల్లిదండ్రులు సత్యనారాయణ, లలిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. హేమంత్ తండ్రి సత్యనారాయణ.. ఆలమూరు పోలీస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.. తన కుమారుడి ఆచూకీ తెలుసుకోవడానికి సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్