Site icon NTV Telugu

Balakrishna: “అలాంటి వాళ్ల తలలు తీసేయాలి”.. బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు..

Balakrishna

Balakrishna

MLA Balakrishna Makes Controversial Remarks: హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం విధివిదానాలపై మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. దుష్ప్రచారం చేసే వారి తలలు తీసేయాలంటూ.. ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

READ MOFRE: Infinix Hot 60i 5G: మార్కెట్‌ను ఏలడానికి సిద్దమైన ఇన్‌ఫినిక్స్‌.. 6,000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల డిస్ప్లేతో రాబోతున్న కొత్త ఫోన్!

ఇదిలా ఉండగా.. నేడు అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భూమి పూజ చేశారు బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎన్నో అవార్డులు వచ్చాయని.. అత్యుత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా దేశంలో మంచి పేరు తెచ్చుకుందన్నారు. క్యాన్సర్ ఆస్పత్రి లాభాపేక్ష కోసం కాదని.. దాతల సహకారంతో ఆస్పత్రి నడుస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తమ క్యాన్సర్ ఆస్పత్రికి కూడా ఎన్నో అవాంతరాలు అధిగమించి నిర్మాణం పూర్తి చేశామని గుర్తుచేసుకున్నారు.

READ MOFRE: Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరామ్, అలీఖాన్ నియామకం రద్దు!

 

Exit mobile version