Dr NTR Vaidya Seva Funds: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (నెట్‌వర్క్) కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనుబంధ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల్లో భాగంగా ప్రభుత్వం రూ. 250 కోట్లను విడుదల చేసింది. నిధుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో జరిపిన చర్చల అనంతరం ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అలాగే, త్వరలోనే మరో రూ. 250 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే వైద్య సేవలను కొనసాగించాలని, అలాగే ఆందోళన విరమించాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఆసోసియేషన్ (AASHA), ఇతర సంఘాల ప్రతినిధులను ఆయన కోరారు. బుధవారం తనను కలిసిన పలువురికి ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలను సౌరభ్ గౌర్ ఈ సందర్భంగా వివరించారు.
Off The Record : ఉమ్మడి కరీంనగర్ లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక తూతూ మంత్రమేనా..?
అయితే, ప్రభుత్వం విడుదల చేసిన పాక్షిక నిధులపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సంతృప్తి చెందలేదు. తాము డిమాండ్ చేస్తున్న రూ. 2,700 కోట్ల పూర్తి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆశా (AASHA) డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన రూ. 250 కోట్లతో తమ బకాయిలు సరిపెట్టుకోలేమని స్పష్టం చేసిన ఆసుపత్రులు, పూర్తి బకాయిలు చెల్లించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించాయి. దీంతో, రేపు (గురువారం) జరగాల్సిన ‘చలో విజయవాడ మహాధర్నా’ యధాతథంగా ఉంటుందని ఆసుపత్రుల యాజమాన్యాలు తేల్చి చెప్పాయి.
Off The Record : జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం పక్కా వ్యూహంతో బీజేపీ
