NTV Telugu Site icon

Heart Attack Treatment: గుండె చికిత్సలపై సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌.. ప్రత్యేక వైద్య వ్యవస్థ ఏర్పాటు..

Ys Jagan

Ys Jagan

Heart Attack Treatment: ఈ మధ్య కాలంలో ఏజ్‌తో సంబంధం లేకుండా ఆకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు పోతున్నాయి.. వృద్ధులు, మధ్య వయస్కులు, యూత్‌, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా కూడా ఇది జరుగుతుంది.. కొందరు నిద్రలోనే ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేస్తూ.. పాటలు పాడుతూ కుప్పకూలిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత ఈ కేసులు మరింత పెరిగినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు.. అయితే, గుండె పోటు చికిత్సలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.. ఇటీవల బాగా పెరుగుతున్న గుండెపోటు మరణాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది.

Read Also: Vijay Devarakonda: స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని..

యువతపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది గుండెపోటు.. అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో గుండెపోటు చికిత్స కోసం ప్రత్యేక వైద్య వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది.. గుండె పోటు వచ్చిన మొదటి గంట గోల్డెన్ హవర్‌గా చెబుతున్నారు వైద్యులు.. దీంతో, మొదటి గంటలో ట్రీట్మెంట్‌ అందించడంపై స్టెమి (STEMI) ప్రాజెక్ట్ తీసుకురానున్నారు.. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్స అందించనున్నారు. 40 వేల రూపాయల విలువ చేసే స్పెషల్ ఇంజక్షన్ల కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి 94 పోస్టులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గుండెపోటు మొదటి గంట ట్రీట్మెంట్ పై చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు.. వచ్చే నెలాఖరులోగా పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రెడీ అవుతోంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.