Site icon NTV Telugu

Andhra Pradesh: అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల స్పందన.. వాటికి ఓకే..

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు.. అయితే, వారి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.. పలు డిమాండ్లపై సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అంగన్వాడీ వర్కర్లకు, సహాయకులను వర్కర్లుగా ప్రమోట్‌ చేసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచనున్నారు.. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత వన్‌ టైం బెనిఫిట్ రూ.50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని.. అంగన్వాడీ సహాయకుల సర్వీసు విమరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్‌ రూ.40వేలకు పెంచాలని.. అంగన్వాడీ వర్కర్లకు TA/DA నెలకు ఒకసారి, అంగన్వాడీ హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read Also: Nawaz Sharif: భారత్ చంద్రున్ని చేరుకుంటే.. పాకిస్తాన్ భూమిపై నుంచి లేవడమే లేదు..

గ్రామీణ/గిరిజన ప్రాంతాలలో ఉన్న 16575 అద్దె భవనాలకు, పట్టణ సముదాయములో ఉన్న 6,705 అద్దె భవనాలకు 66.54 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం.. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 48,770 మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ కు Rs.500 చొప్పున, 6837 మినీ అంగన్వాడి సెంటర్స్ కు 250 చొప్పున మంజూరు చేసింది. సొంత భవనాల నిర్వహణ- గోడల పెయింటింగ్ లు, చిన్నపాటి మరమ్మత్తుల కింద 21, 206 అంగన్వాడీ సెంటర్స్ కు (ఒకొక్క కేంద్రానికి 3000/- రూపాయల చొప్పున) Rs.6.36 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

Exit mobile version