Site icon NTV Telugu

Honorarium Increased: నాయీ బ్రాహ్మణుల భృతిని రూ. 25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు

Barber

Barber

Honorarium Increased: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల్లో సేవలందించే నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర దేవాదాయశాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, నాయీ బ్రాహ్మణులకు నెలలవారీగా అందే భృతిని రూ. 25,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారికి లభిస్తున్న రూ.20,000 కమిషన్‌ను రూ.25,000కు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేశారు.

ఈ జీవో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు వర్తించనుంది. ఇందులో ప్రతి దేవాలయంలో ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు సేవలందించే నాయీ బ్రాహ్మణులకు ఈ పెంపు వర్తించనుంది. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణులకు కనీస మొత్తంగా నెలకు రూ.25 వేలు అందేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాయీ బ్రాహ్మణుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, వారికి ఇచ్చే కమిషన్‌ను పెంచాలని ఆయన సూచించారు. సీఎం సూచన మేరకు దేవాదాయశాఖ తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయం ద్వారా దేవాలయాల్లో నిరంతరంగా సేవలందించే నాయీ బ్రాహ్మణులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం లభించనుంది లభించనుంది.

Exit mobile version