NTV Telugu Site icon

YS Jagan Pulivendula Tour: ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పులివెందులకు వైఎస్‌ జగన్‌..

Ys Jagan

Ys Jagan

YS Jagan Pulivendula Tour: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ నెల 19న అనగా బుధవారం రోజు పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్‌ జగన్‌.. 19న సాయంత్రం 3 గంటల కు గన్నవరం నుంచి విమానంలో కడపకు చేరుకోనున్నారు.. ఇక, కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు.. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయిన తర్వాత మొట్టమొదటి సారి సొంత నియోజకవర్గానికి జగన్ వస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది.. రెండు రోజుల పాటు జిల్లాలో మకాం వేయనున్న ఆయన.. సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉందంటున్నారు.. రోజుకో నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్‌ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అధైర్య పడకండి.. అండగా ఉంటానని వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.. ఇక, రెండు రోజుల పర్యటన ముగించుకుని ఈ నెల 21వ తేదీన తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Read Also: Actor Darshan: ఒక మేనేజర్ మిస్సింగ్.. మరో మేనేజర్ ఆత్మహత్య.. మరిన్ని చిక్కుల్లో దర్శన్?