Site icon NTV Telugu

YSR Law Nestham: వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. వారి ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ

Cm Ys Jagan

Cm Ys Jagan

YSR Law Nestham: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జూనియర్‌ న్యాయవాదులకు శుభవార్త చెప్పారు.. నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్ధిక సహాయం అందించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు లబ్ధి చేకూరనుంది.. సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన ప్రకారం.. జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ. 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తూ వస్తున్నారు.. ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2023 అంటే 5 నెలలకు సంబంధించిన స్టైఫండ్‌ను ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు.. మొత్తం రూ. 6,12,65,000ను నేడు వర్చువల్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

యువ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు అండగా ప్రభుత్వం ఆర్ధిక చేయూత అందిస్తూ వస్తుంది.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60,000 చొప్పున ఆర్ధిక సహాయం చేస్తూ వస్తున్నారు.. రెండు దఫాల్లో ఈ చెల్లింపులు చేస్తున్నారు.. మూడేళ్లకు మొత్తం రూ. 1,80,000 స్టైఫండ్ అందిస్తోంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌. వృత్తిపరంగా యువ న్యాయవాదుల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా వైఎస్సార్‌ లా నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు.. అర్హులైన యువ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు ఐదు వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు సీఎం జగన్‌..

Read Also: Prithviraj Sukumaran: బిగ్ బ్రేకింగ్.. ‘సలార్’ విలన్ కు ప్రమాదం.. హాస్పిటల్ లో చికిత్స

మరోవైపు.. న్యాయ­వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్‌ జన­రల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ సెక్రటరీ సభ్యు­లుగా రూ.100 కోట్లతో ‘అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ను ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. న్యాయవా­దులకు రుణాలు, గ్రూప్‌ మెడిక్లెయిమ్‌ పాల­సీలు, తదితర అవసరాల కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం అందించింది. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్‌లైన్‌లో నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.. ఇక, వైఎస్సార్‌ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవా­దుల ఇబ్బందుల పరిష్కారానికి 1902 నంబర్‌ను అందుబాటులో ఉంచింది ఏపీ ప్రభుత్వం.

Exit mobile version