Site icon NTV Telugu

Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం..!

Tourism Conclave Tech Ai 2.0

Tourism Conclave Tech Ai 2.0

Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధి దిశగా బడ్జెట్, విధానాలు, ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST), ఏపీటీడీసీ సంయుక్తంగా నిర్వహిస్తున్న టూరిజం కాన్‌క్లేవ్ టెక్ AI 2.0 రెండవ రోజు సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని కీలక అభిప్రాయాలను తెలిపాడు.

ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక విధానాల అమలులో గణనీయ పురోగతి సాధించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాజెక్టుల వేగవంతత, స్థానికంగా భాగస్వామ్యాల ప్రోత్సాహానికి ఇన్వెస్టర్ల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Read Also:Xiaomi MIX Flip 2: ఫోల్డబుల్ డిజైన్, లైకా కెమెరాతో షియోమి MIX Flip 2 విడుదల.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..!

ఈ కాన్‌క్లేవ్‌లో పర్యాటక రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించగా, రూ.10,039 కోట్ల విలువైన ఒప్పందాలను సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతోంది. విశాఖ, అమరావతి, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పర్యాటక హోటళ్ల నిర్మాణానికి ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ టూరిజం కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. జూలై 2న విశాఖపట్నం నుంచి చెన్నైకి కార్డీలియా క్రూయిజ్ సేవలు పునఃప్రారంభం కానున్నాయన్నారు. పుదుచ్చేరి మీదుగా వెళ్లే ఈ క్రూయిజ్ సేవలను సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గతంలో ఇదే సంస్థ చెన్నై – విశాఖ మధ్య క్రూయిజ్ సేవలు అందించింది.

Read Also:Kannappa : కన్నప్పలో ఆ సీన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్

అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో నిలిపివేసిన కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సేవల పునఃప్రారంభంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూ, అటవీశాఖతో చర్చించి, బస్సు సర్వీసులను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. నేటి నుంచే తిరిగి ఆర్టీసీ బస్సులు నడవనున్నట్లు మంత్రి తెలిపారు.

Exit mobile version