Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Paper Mill Fine: రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుపై కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలు చేపట్టింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని నిర్ధారించిన పీసీబీ.. పేపర్ మిల్లు పరిశ్రమకు రూ.21 కోట్లకు పైగా పర్యావరణ పరిహారం విధించింది. గోదావరిలో వ్యర్థాల విడుదలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ.. కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేసింది.
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రూ.21.01 కోట్ల పర్యావరణ పరిహారం క్రింద జరిమానా విధించింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ వెల్లడించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 26న తూర్పులంక ఇసుక మేటలు, పరిసర ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా గుర్తించిన పర్యావరణ ఉల్లంఘనలపై పీసీబీ మే 28, జూన్ 12 తేదీల్లో ఆంధ్రా పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వ్యర్థాల పారవేతకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
సంస్థకు లోపాలు సరిదిద్దుకునేందుకు తగిన సమయం, అవకాశాలు కల్పించినప్పటికీ సెప్టెంబర్ 3న నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పర్యావరణ పరిహారంగా రూ.21.01 కోట్ల జరిమానా విధించారు. గోదావరి పరిసరాల్లో వ్యర్థాలను విడుదల చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పీసీబీ స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ ఉండదని, భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?