APL lockout: ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్‌కు లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం.. గత 23 రోజులుగా సమ్మెలో ఉన్నారు పేపర్ మిల్ కార్మికులు.. బీ-షిప్ట్ నుంచి కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు నోటీసు బోర్డులో ఓ లేఖ పెట్టారు.. ఈ నేపథ్యంలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పేపరు మిల్లు వద్దకు చేరుకుంటున్నారు.. దీంతో, అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, వేతన ఒప్పందం చేయాలని ఈ నెల 2వ తేదీ నుంచి పేపరు మిల్లులోని 11 కార్మిక సంఘాలు శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తున్నాయి.. కొత్త వేతన ఒప్పందం కోసం సుమారు 2,800 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం.. అర్థంతరంగా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Rishabh Pant: అతడిపై నమ్మకం ఉంచాం.. ప్లాన్ వర్కౌట్ అయింది: పంత్
ఇటీవల బస్సు యాత్రలో పేపర్ మిల్లు మీదుగా వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు కార్మికులు.. కానీ, కొన్ని రోజుల వ్యవధిలోనే లాకౌట్ ప్రకటించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు.. మరోవైపు.. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ నెల 12న సమావేశానికి పిలిచినప్పటికీ యాజమాన్యం.. ఆ సమావేశానికి హాజరుకాలేదు.. అయితే, ఏపీ పేపర్ మిల్లు యాజమాన్యం 2017లో చివరిసారిగా వేతన ఒప్పందం చేసిందని.. ఈ నెల 20న నో వర్క్- నో పేను యాజమాన్యం ప్రకటించగా.. ఇప్పుడు లాకౌట్‌ను ప్రకటించింది.
Read Also: Delhi: ఇండియా గేట్ వద్ద ఐస్ క్రీం విక్రేత దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) యాజమాన్యం ఏప్రిల్ 2 నుండి కొనసాగుతున్న సమ్మె ప్రభావాన్ని చూపుతూ ఏప్రిల్ 24 (బుధవారం) తన రాజమహేంద్రవరం యూనిట్‌కు ‘లాకౌట్’ ప్రకటించింది. ఏపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ జారీ చేసిన అధికారిక లేఖ ప్రకారం, కార్మికులు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఫలితంగా మిల్లులో ఆపరేషన్ మరియు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చిన లాకౌట్‌పై ఏపీఎల్ యాజమాన్యం తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవి లతకు సమాచారం అందించింది. కొత్త వేతన విధాన ఒప్పందంపై యాజమాన్యం సంతకం చేయాలని, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 2,800 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. దాదాపు 800 మంది పర్మినెంట్ కార్మికులు, 1,200 మంది తాత్కాలిక కార్మికులు మరియు 800 మంది దినసరి కూలీలు లాకౌట్ వల్ల ప్రభావితమవుతారు.