వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేస్తుంది.. అందులో భాగంగానే శివనగర్ లోని మెట్ల బావిలో పూడిక తీస్తుండగా ఒక వింత ఘటన చోటుచేసుకుంది. మరమ్మత్తుల దృశ్య మెట్ల బావి నుంచి మట్టి తీస్తుండగా పురాతన శివలింగం బయట పడింది. ఈ శివలింగాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తు వచ్చి చూసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడే ప్రత్యేక్షం అయ్యాడు అంటూ స్థానికులు అనుకుంటున్నారు.
Read Also: Bigg Boss 7:నా ప్రాపర్టీ అంటావా… మళ్లీ ప్రశాంత్ పై రెచ్చిపోయిన రతిక
కాకతీయుల కాలం నాటి పురాతనమైన మెట్ల బావి ఆనాటి చరిత్ర చెబుతుంది. కాకతీయుల రాణి రుద్రమదేవి తన రహస్య ప్రదేశమని పూర్వీకులు చెబుతున్నారు. తన రహస్య ప్రదేశమైన మెట్ల బావిలో అభివృద్ధి కోసం పూడికతీస్తున్న తరుణంలో మున్సిపల్ కార్మికులకు శివలింగం బయట పడిందని స్థానిక కార్పొరేటర్ దిద్ది కుమార్ స్వామి వెల్లడించారు. పూడిక తీస్తున్న తరుణంలో ఇది బయటపడిందని.. ఈ శివలింగానికి 34 డివిజన్ మహిళలు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించారు. వరంగల్ మహిళల కోరిక మేరకు ఈ యొక్క శివలింగానికి ప్రత్యేక దేవాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో చేస్తామని స్థానిక కార్పొరేటర్ తెలిపారు.
Read Also: New Rules: అక్టోబర్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ..
ఇక, బయటపడిన పురాతన కాలం నాటి శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని, ఇక్కడ ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వరంగల్ బీజేపీ నేతలు అంటున్నారు. నేడు (మంగళవారం) శివనగర్ లోని మెట్ల బావి దగ్గర బయటపడిన పురాతన శివలింగానికి పలువురు బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయుల కాలం నాటి ఎన్నో గుళ్ళు, గోపురాలు నేల మట్ట మయ్యాయని, స్వరాష్ట్రం సిద్ధించి తొమ్మిది ఏళ్లు అయినా ఒక్క ఆలయ పునరుద్ధరణను ప్రభుత్వం చేపట్టలేదని కమలనాథులు మండిపడ్డారు. ఇప్పటికీ కాకతీయులు ఎన్నో అద్భుత కట్టడాలు మట్టిలో కూరుకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖిలా వరంగల్ కోట, దాని పరిసరాల్లో ఉన్న నాటి శిల్ప సంపద, అలయంనకు పూర్వ వైభవం తీసుకురావాలని బీజేపీ డిమాండ్ చేసింది. అలాగే కబ్జాకు గురవుతున్న ఆలయ భూములను పరిరక్షించాలని కమలం పార్టీ నాయకులు స్పష్టం చేశారు.