ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, తెలుగు యాంకర్ వింధ్య విశాఖ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జన్యుపరమైన కారణాలతో కిడ్నీ, లివర్ ఫెల్యూర్‌తో భాదపడుతున్న ఓ కుర్రాడికి తన వంతు సాయం చేశారు. అంతేకాదు ఆ బాలుడికి ఆరోగ్య శ్రీ వర్తించదని, అతడి కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స కోసం అందరూ సాయం చేయాలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. నిరుపేద బాలుడికి ఆర్థిక సహాయం అందించిన వింధ్య విశాఖను అందరూ ప్రశంసిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని గిరిపల్లి గ్రామంకు చెందిన తోమ్మిదేళ్ల ప్రణీత్ జన్యుపరమైన కారణాలతో బాధపడుతున్నాడు. వారంలో 3 రోజులు డయాలసిస్ కోసం నగరంలోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి బాలుడి తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. అదే కిమ్స్ ఆసుపత్రిలో తన తండ్రి డయాలసిస్ కోసం వింధ్య విశాఖ తరచుగా వెళ్తున్నారు. ఈ సమయంలో తమ పక్క బెడ్ పైనే ఉన్న ప్రణీత్ పరిస్థితిని చూసి వింధ్య చలించిపోయారు. బాలుడి తల్లిదండ్రులను డీటెయిల్స్ అడిగి తెలుసుకుని.. తనవంతు సహాయంగా లక్ష అందించారు. తప్పక విజయం సాదిస్తావని బాలుడికి వింధ్య దైర్యం చెప్పారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని, తన జెర్సి నెంబర్ 18 అని ప్రణీత్ చెప్పాడు.
Also Read: Sharwanand Transformation: అయ్య బాబోయ్.. గుర్తుపట్టలేకుండా మారిపోయిన శర్వానంద్!
ప్రణీత్ వైద్యం కోసం అతడి తల్లిదండ్రులు ఇప్పటికే చాలా ఖర్చు చేశారు. అర ఎకరం భూమి అమ్మి.. 20 లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించారు. కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అయితే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.40 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారట. అంత మొత్తం తమ దగ్గర లేదని, తమని ఆదుకోవాలని ప్రణీత్ పేరెంట్స్ కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు ప్రణీత్ పేరెంట్స్ ఫోన్ నెంబర్ (9849520535)కు ఫోన్‌పే లేదా గూగుల్ పే చేయవచ్చు.
