Anchor Suma : స్టైలిష్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న యాంకర్ సుమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన ఉదయభాను, ఝాన్సీ కొంచెం నెమ్మదించారు. సుమ మాత్రం దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్ గా చేశారు. ఓ స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని స్టార్డం ఆమె సొంతం.
ఎంత పెద్ద హీరో అయిన సుమకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు.. మలయాళీ అమ్మాయి తెలుగు యాంకర్ ఈ స్థాయిలో సక్సెస్ కావడం ఊహించని పరిణామం. జాబ్ రీత్యా సుమ తండ్రి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. దాంతో సుమ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమ కెరీర్ మొదలైంది నటిగానే కావడం విశేషం.. సుమ తొలుత ఈ అమ్మడు కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ హీరోయిన్ గా చేశారు. ఈ చిత్ర హీరో స్టార్ రైటర్ వక్కంతం వంశీ కావడం మరొక విశేషం. దాసరి నారాయణరావు దర్శకుడు కాగా… మూవీ ఆశించినంతగా హిట్ అవ్వలేదు.. ఆ తర్వాత మలయాళంలో మూడు చిత్రాలు చేశారు. ఆమెకు బ్రేక్ రాలేదు. కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించిన సుమ యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. ఈ రంగంలో సుమకు తిరుగు లేకుండా పోయింది..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోయారట. పెళ్ళైతే యాక్టింగ్ మానేయాలని రాజీవ్ కనకాల కండిషన్ పెట్టడంతో సుమ హర్ట్ అయ్యారట. కొన్నాళ్ళు డిస్టెన్స్ మైంటైన్ చేసిందట. మనసు మార్చుకున్న రాజీవ్ నీ ఇష్టమైన రంగం ఎంచుకో నాకు అభ్యంతరం లేదని చెప్పడంతో పెళ్లి చేసుకున్నారట. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్య తెలుగు యాంకర్స్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు… ఇక సుమ కూడా అదే జాబితాలోకి చేరింది.. సుమ కూడా తగ్గడం లేదు. కోటు సూటులో సూపర్ స్టైలిష్ లుక్ సుమ మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!

