Site icon NTV Telugu

Anchor Pradeep : యాంకర్‌ ప్రదీప్‌కి ప్రపోజ్‌ చేసిన స్టార్ హీరోయిన్

Anchor Pradeep, Love Proposal, Heroine Malvika Nair

Anchor Pradeep, Love Proposal, Heroine Malvika Nair

Anchor Pradeep : బుల్లితెరపై మేల్ యాంకర్స్ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం ఆయన మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. దాదాపు నాలుగు పదుల వయసు వస్తున్నా పెళ్లి ప్రస్తావనే లేదు. ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ లేదు. లవ్‌ ఎఫైర్ల వార్తలే లేవు. ఇప్పటికీ పెళ్లంటే మాట దాటేస్తుంటారు. ప్రస్తుతం ఆయన `సరిగమప`, `సర్కార్‌` వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే మొదటి సారి స్టేజ్ మీద ఓ స్టార్ హీరోయిన్ ఆయనకు ప్రపోజ్ చేసింది. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. `అన్ని మంచి శకునములే` చిత్రంతో రేపు(గురువారం) ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు హీరోయిన్‌ మాళవిక నాయర్‌.. యాంకర్‌ ప్రదీప్‌కి ప్రపోజ్‌ చేయడం విశేషం.

Read Also:Sharwa Rakshita: శర్వానంద్ పెళ్ళి పీటలు ఎక్కేదెప్పుడంటే…

`ఆహా`లో రన్‌ అవుతున్న`సర్కార్‌`షో ప్రస్తుతం మూడో సీజన్‌ నడుస్తుంది. దీనికి `అన్ని మంచి శకునములే` టీమ్‌ మెంబర్స్ దర్శకురాలు నందినిరెడ్డి, హీరో సంతోష్‌ శోభన్‌, హీరోయిన్‌ మాళవిక నాయర్‌ హాజరయ్యారు. సినిమాని ప్రమోట్‌ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరితో తన గేమ్‌ ఆడించాడు ప్రదీప్‌. అయితే ఈ టీమ్‌ వచ్చిన ప్రారంభం నుంచి ప్రదీప్‌.. మాళవిక నాయర్‌పై ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చాడు. ఆమె మాట్లాడకపోతే డైరెక్టర్‌ని షాట్‌ చెప్పమని అడగ్గా, నువ్వే మాట్లాడటం లేదని ఆమె చెప్పడంతో సిగ్గులతో ముగ్గేశాడు.

Read Also:Bandi Sanjay Kumar: మరో 5 నెలలు ఆగండి.. కేసీఆర్ సర్కార్‌నే నిషేధించబోతున్నారు..!

ఆడియెన్స్ ని `మీరు మిగిలిన వాళ్లతో మాట్లాడుతూ ఉండండి` అని తాను మాళవికని చూసుకుంటానని ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం, నందిని రెడ్డి.. `ప్రదీప్‌ నువ్వు హీరో కూడా` అని చెప్పడంతో మరింత సిగ్గులొలికించాడు. ఇది హైలైట్‌గా నిలిచింది. మాళవిక చేత దాగుడు మూతలు ఆడిపించాడు ప్రదీప్‌. దీనికి నందినిరెడ్డి రియాక్ట్ అవుతూ, నాకు ఎందుకో ఈ మొత్తం ప్రొసీజర్‌లో.. ప్రదీప్‌నీకు లైన్‌ వేయడానికి ట్రై చేస్తున్నట్టు తనకు అనుమానంగా ఉందని చెప్పడం విశేం. అనంతరం మాళవిక ఇక ఆగలేకపోయింది. దొరికిన క్యాలీ ఫ్లవర్‌ తీసుకుని ప్రదీప్‌కి ప్రపోజ్‌ చేసింది. దీంతో ప్రదీప్‌ మొదట ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అనంతరం సిగ్గులొలికించాడు. ఆమె ఇచ్చిన క్యాలీ ఫ్లవర్‌ తీసుకుని ఎమోషనల్‌ అయ్యాడు. ఇకపై తాను క్యాలీ ఫ్లవర్‌ని కూడా ఫ్లవర్‌ జాబితాలో చేర్చుతానని చెప్పడంలో నవ్వులు పూయించింది.

Exit mobile version