Geetha Bhagat : సినిమాల్లో నటించాలనుకునే వాళ్ళ కోసం తెలుగు యాంకర్ కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యాంకర్ గీతా భగత్ కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాకుండా, సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకునే యువత కోసం ఆమె సరికొత్త వేదికను సిద్ధం చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఆరెంజ్ కాస్టింగ్’ పేరుతో ఒక కాస్టింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. సినిమా రంగంపై మక్కువ ఉన్న ఎంతోమంది యువతీ యువకులు సరైన దారి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఒక వారధిలా నిలవాలని గీతా భగత్ ఈ ఏజెన్సీని స్థాపించారు. దీనికి సంబంధించిన లోగోను ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎక్కడో మారుమూల ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, వారిని వెలుగులోకి తీసుకురావడం, సినిమాలు, వెబ్ సిరీస్, యాడ్స్ కి కొత్త ముఖాలకు సరైన అవకాశాలు కల్పించడం, కొత్త నటీనటులకు ఇండస్ట్రీకి మధ్య ఒక బాధ్యతాయుతమైన వేదికగా నిలవడం ఈ ఏజెన్సీ లక్ష్యం అని ఆమె చెబుతున్నారు.
“మంచి విషయాలను ప్రకటించడానికి కాస్త సమయం పట్టినా పర్వాలేదు” అంటూ గీతా భగత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “మా ప్రయాణం ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు అధికారికంగా మీ ముందుకు వస్తున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మున్ముందు మరెన్నో అద్భుతమైన అప్‌డేట్స్ రాబోతున్నాయి” అంటూ ఆమె నెటిజన్లలో ఆసక్తిని పెంచారు. యాంకర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతా భగత్అ వకాశాల కోసం వేచి చూస్తున్న వర్ధమాన నటీనటులకు ‘ఆరెంజ్ కాస్టింగ్’తో ముందుకు రావడంపై ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!