NTV Telugu Site icon

Anatomy Of a Fall: ఓటీటీలోకి వ‌చ్చేసిన ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?!

4

4

ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డును గెలుచుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచ్ మూవీగా తీసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఫ్రెంచ్ తో పాటు ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, త‌మిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు కాను తాజాగా ప్రకటించిన 96వ ఆస్కార్డు అవార్డులలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ హీరోయిన్ లతోపాటు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ విభాలలో కూడా నామినేషన్లను దక్కించుకుంది. ఇందులో భాగంగా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది.

Also read: Virat Kohli- Gambhir: వీరికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చు: సునీల్ గవాస్కర్

ఈ సినిమాకు కేవలం ఆస్కార్ అవార్డు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా కింగ్స్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. విటితోపాటు యూరోపియన్ ఫిలిం అవార్డ్స్, బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిలిం అవార్డ్స్, సిడ్ని ఫిలిం ఫెస్టివల్ ఇలా అనేక రకాల ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగి చాలా చోట్ల బెస్ట్ సినిమా అవార్డులను దక్కించుకుంది.

Also read: AP DSC 2024 Postponed: నేడు జరగాల్సిన ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన విద్యాశాఖ ..!

ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమాలో.. హీరోయిన్ సాండ్ర హ‌ల్ల‌ర్ కీలకపాత్రను పోషించింది. హీరోయిన్ గా చేసిన ఆవిడ తన నటనతో సినీ విమర్శకులను సైతం తనను ప్రశంసించేలా చేస్తుంది. నిజానికి ఆమె చేసిన నటనకు ఆస్కార్ రావచ్చని గట్టిగా అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది ఆ సమయంలో. ఇందులో భాగంగానే ఆస్కార్ నామినేషన్ కూడా ఎన్నికైన సాండ్ర హ‌ల్ల‌ర్ తృటిలో అవార్డును కోల్పోయింది. ఇక ఈ సినిమా కేవలం 6 మిలియన్ డాలర్లతో తెరకెక్కించగా ప్రపంచ వ్యాప్తంగా 35 మిలియన్ల డాలర్లను రాబట్టింది.

Show comments