సినిమా షూటింగ్‌లలో పనివేళల గురించి జరుగుతున్న రచ్చపై యంగ్ బ్యూటీ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కరీనా కపూర్, కల్యాణి ప్రియదర్శన్‌లతో కలిసి పాల్గొన్న అనన్య.. దీపికా పదుకొణె అంకితభావాన్ని కొనియాడారు.
Allso Read : Kamal Haasan: ‘‘ మీ పనిచూసుకోండి ట్రంప్’’.. కమల్ హాసన్ విమర్శలు..
దీపికా పదుకొణెతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘దీపికా చాలా డెడికేషన్ ఉన్న నటి. మేము కలిసి పనిచేసినప్పుడు ఆమె వర్కింగ్ అవర్స్ గురించి ఎలాంటి డిమాండ్లు చేయలేదు, ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు’ అని అనన్య చెప్పారు. అయితే ఇప్పుడు దీపికా టైమింగ్స్ విషయంలో పట్టుబట్టడం వెనుక ఉన్న కచ్చితమైన కారణాన్ని కూడా ఆమె విశ్లేషించారు.. ‘దీపికా ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి. ఆ చిన్నారికి కనీసం రెండేళ్ల వరకు తల్లి తోడు కచ్చితంగా ఉండాలి. అందుకే ఆమె షూటింగ్ సమయాల విషయంలో కొన్ని డిమాండ్లు చేశారు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఒక తల్లిగా ఆమె తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను’ అని అనన్య కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, కరీనా కపూర్ తల్లి అయిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న పాత ఆలోచనా ధోరణిని మార్చేశారని అనన్య ఈ సందర్భంగా ప్రశంసించారు.
