బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అనన్య పాండే నటించినది తక్కువ సినిమాలే అయిన కానీ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ భామ సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ భామ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ సినిమా తనకు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చిపెడుతుందని ఆమె ఎంతగానో భావించింది..కానీ ఆమె అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దానితో ఈ భామకు తెలుగులో అవకాశాలు రావడం లేదు..
తాజాగా అనన్య పాండే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా అవుతున్నాయి.కరణ్ జోహార్ తెరకెక్కించిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ .సినిమా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. కాగా ఈ మూవీ నుంచి చిత్ర యూనిట్ హార్ట్ త్రోబ్ అనే ప్రత్యేక పాటను తాజాగా విడుదల చేసింది. బాలీవుడ్ నటీనటులు అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ మరియు వరుణ్ ధావన్‌లు ఆ పాటలో రణ్‌వీర్‌తో కలిసి చిందులేశారు. ఈ సందర్భంగా అనన్య ఇన్‌స్టా వేదికగా ఆ పాట వీడియోను పోస్ట్ చేసింది…అందులో నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన క్షణం ఇది.కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలో నేను చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాల్లో నటించడానికి ఆయనే కారణం. ఆయన వల్ల నా కల నిజమైంది. కరణ్‌కు చాలా కృతజ్ఞతలు తెలిపింది.రణ్‌వీర్ సింగ్ తో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. రణ్‌వీర్ ల ఎవరూ కూడా డ్యాన్స్ చేయలేరని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
