Site icon NTV Telugu

Ananya Nagalla : అలాంటి సీన్స్ చేసే విషయంలో నా మనసు మార్చుకున్నాను..

Whatsapp Image 2024 02 29 At 11.00.59 Am

Whatsapp Image 2024 02 29 At 11.00.59 Am

‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనన్య నాగళ్ల తొలి సినిమాతోనే సహజ నటనతో చక్కగా ఆకట్టుకుంది. ‘మల్లేశం’ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఈ భామ కనిపించింది. కానీ, ప్రస్తుతం రూటు మార్చింది. అందాల ఆరబోత, కిస్ సీన్లకు ఏమాత్రం వెనుకాడబోనంటుంది.‘తంత్ర’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న అనన్య బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ సీన్లలో నటించనని చెప్పినా, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలిపింది.. “తాను ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాలో పెద్ద కిస్ సీన్ ఉంటుంది. ఆ సినిమాకు అది ఎంత అవసరం.. అనేది ఆ సినిమా ట్రైలర్ లాంఛ్, లేదంటే ఆ మూవీ విడుదల అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కానీ, ఆ సందర్భంలో చాలా ముఖ్యం కాబట్టే చేశాను అని తెలిపింది..

‘తంత్ర’ సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. గ్లామర్, రొమాంటిక్ సీన్లు, సోషల్ మెసేజ్ మరియు హారర్ ఇలా అన్నీ ఉంటాయి. ఆయా సినిమాలకు అవసరమైన రీతిలో తప్పకుండా నటిస్తాను. 6 నెలలకు లేదంటే ఏడాదికి ఓసారి మనిషి మారుతూ ఉంటారు. అలా మారకపోతే మన గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. ‘మల్లేశం’ సినిమా సమయంలో నేను ఇండస్ట్రీకి కొత్త. ఎలా చేసినా కూడా మనకు రోల్స్ వస్తాయి అనుకున్నాను. అయితే, నటనలో రొమాంటిక్ సీన్లు కూడా సినిమాలో ఓ భాగం అని అర్థచేసుకోవడానికి నాకు కొంచెం టైమ్ పట్టింది” అని అనన్య చెప్పుకొచ్చింది.ప్రస్తుతం అనన్య నాగళ్ల హీరోయిన్ గా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హారర్ మూవీ ‘తంత్ర’ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది

Exit mobile version