అనన్య నాగళ్ళ.. ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.కెరీర్ మొదటిలో ఎంతో పద్దతిగా కనిపించిన ఆ తరువాత తనలోని గ్లామర్ లుక్ ని బయట పెట్టింది.అనన్య మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఆ తర్వాత వెండితెరపై అవకాశం అందుకుంది. అలా తొలిసారి గా మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమా తర్వాత వకీల్ సాబ్ సినిమా లో అవకాశం అందుకుంది. ఆ తర్వాత పలు చిన్న సినిమాలలో కూడా నటించింది.. కానీ ఈ భామ కు హీరోయిన్ గా అంతగా అవకాశాలు రావట్లేదు.హీరోయిన్ పక్కన సైడ్ క్యారెక్టర్స్ లో ఎక్కువగా నటిస్తుంది.. రీసెంట్ గా మళ్లీ పెళ్లి, శాకుంతలం సినిమాలో నటించగా అందులో తన అందాలతో అందర్నీ బాగా ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. చిట్టీ పొట్టి బట్టలతో ఫోటో షూట్స్ చేస్తూ తన ఫ్యాన్స్ ని బాగా అలరిస్తుంది.. ఇక ఆమె ఆ విధంగా గ్లామర్ షో చేయటంతో ప్రతి ఒక్కరు ఆమెను ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. అవకాశాలు రావాలంటే నటన పరం గా టాలెంట్ ని చూపించాలి కాని అందం పరంగా కాదు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక షార్ట్ వీడియోను పంచుకుంది ఈ భామ. ఇక అందులో తను గెంతులు వేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వీడియో చూసిన తన ఫాలోవర్స్ తన అందం గురించి కొన్ని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న వయసులో నే అంత బరువును ఎలా మోస్తున్నారు అంటూ తన ఫిజిక్ గురించి కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇలాంటి కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు ఈ భామ. తన పని తాను చేసుకుంటూ పోతుంది.