Site icon NTV Telugu

Pottel : మరో క్రేజీ మూవీ తో వస్తున్న అనన్య.. “పొట్టేల్”టీజర్ టైం ఫిక్స్..

Whatsapp Image 2024 04 15 At 3.51.02 Pm

Whatsapp Image 2024 04 15 At 3.51.02 Pm

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం ఆయిన అనన్య తన క్యూట్ లుక్స్ తో, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ తరువాత వచ్చిన పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్‌ మూవీతో అనన్యకి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తరువాత అనన్యకి వరుసగా సినిమాలలో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. హీరోయిన్ గా కూడా ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.అనన్య నాగళ్ల తాజాగా నటించిన తంత్ర సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శుద్ర శక్తులు వున్న అమ్మాయిగా అనన్య ఎంతో అద్భుతంగా నటించింది.. అలాగే తన అందంతో కూడా ఈ భామ ప్రేక్షకులను ఆకట్టుకుంది..అయితే ఈ సినిమా తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో అనన్య ప్రేక్షకుల ముందుకురాబోతుంది.

ఆమె నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్’. ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ‘బంధం రేగడ్’, ‘సవారీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోతుకురి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు… తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా నుండి ఇప్పటికే  విడుదల చేసిన గ్లింప్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి చిత్రయూనిట్ టీజర్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్‌ను శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను ఎన్ఐఎస్ఏ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్ మరియు చత్రపతి శేఖర్ వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు..

Exit mobile version