NTV Telugu Site icon

Anantnag-Rajouri: చరిత్ర సృష్టించిన అనంత్‌నాగ్-రాజౌరీ పోలింగ్.. 35 ఏళ్లలో ఇదే తొలిసారి

Akeke

Akeke

దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ పోలింగ్ చరిత్ర సృష్టించింది. గత 35 ఏళ్లలో లేనంతగా ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 51.35 శాతం ఓటింగ్ నమోదు చేసిందని స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్ ట్విట్టర్‌లో తెలిపింది. దీనితో కాశ్మీర్ లోయలోని మూడు పోలింగ్ కేంద్రాలు అత్యధిక ఓటింగ్‌ను నమోదు చేశాయని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: గతంలో ఆమె తిరస్కరించారు..ప్రధాని అభ్యర్థిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

అనంత్‌నాగ్-రాజౌరీ స్థానం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆమె ఆందోళన కూడా చేశారు. పూంచ్‌ జిల్లాలో ఇరుపార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Skoda: త్వరలో కొత్త మోడళ్లతో భారత్ మార్కెట్లోకి స్కోడా..

ఇక ఆరో విడతలో భాగంగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు దాదాపు 57.70 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 77.99 శాతం, అత్యల్పంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 52.02 శాతం ఓటింగ్‌ నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో 53.75 పోలింగ్‌ నమోదైంది. హర్యానాలోని కర్నాల్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్‌ నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఏడో విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.