Election Model Code: అనంతపురం : ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు అన్ని రకాల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వినోద్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నామినేషన్ వేసే అభ్యర్థులు కచ్చితంగా 13రకాల డాక్యూమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అవరసమైన సాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ పత్రాల్లో అన్ని అంశాలు పొందుపరచాలన్నారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి 3గంటల వరకు పత్రాలు స్వీకరిస్తామన్నారు. చివరి రోజు 3గంటలకు ఒక్క సెకన్ మించినా నామినేషన్లు తీసుకోమని చెప్పారు. అభ్యర్థులు పెట్టే ఖర్చుల విషయంలో కూడా ప్రతిదీ నోట్ చేస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎలా ఫిర్యాదులు చేయాలన్నా.. సీవిజిల్ యాప్ ను ఉపయోగించాలన్నారు.
Read Also: Nepal: నేపాల్‌ని “హిందూ దేశం”గా ప్రకటించాలని ప్రజా ఉద్యమం..