NTV Telugu Site icon

Anand Mahindra: ధోనిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన ఆనంద్ మహీంద్రా.. ట్వీట్ వైరల్..!

15

15

ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా ఆదివారం నాడు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులను సాధించింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డాషింగ్ బ్యాట్స్మెన్ శివం దుబే ఇరువురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో స్కోర్ బోర్డుపై రన్స్ బాగానే వచ్చాయి. ఇక చివర్లో చెన్నై బ్యాట్స్మెన్ మిచెల్ అవుట్ కావడంతో క్రిజ్ లోకి మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు.

Also read: Viral Video: స్కూల్ ఆవరణలో రెండు స్కూల్ బస్సుల్లో చెలరేగిన మంటలు.. చివరకు..?!

అయితే ధోని గ్రౌండ్ లోకి వచ్చే సమయానికి కేవలం 4 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇకపోతే చెన్నై అభిమానులు మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు వస్తే చాలు అన్నట్లుగా ఉండగా.. మహేంద్రసింగ్ ధోని మాత్రం వారికి ‘పైసా వసూల్’ అన్నట్టు చేసాడు. మహేంద్ర సింగ్ ధోని ఆడిన చివరి 4 బంతులలో 20 పరుగులను సాధించాడు. ఇందులో మొదటి మూడు బంతులను సిక్సర్స్ గా మలిచిన ధోని.. చివరి బాల్ ను 2 పరుగులతో సరిపెట్టాడు. దీంతో ధోని అభిమానులు పండుగ చేసుకున్నారు.

Also read: CSK vs MI: చెన్నై భారీ స్కోరు.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

ఇకపోతే దిగ్గజ వ్యాపారవేత్త ఆనందం మహీంద్రా.. ధోని బ్యాటింగ్ ను పొగడ్తలతో ముంచేశాడు. ఇందుకు సంబంధించి తాజాగా అతను ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ లో.. అవాస్తవ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఒత్తిడిలో ఈయన కంటే ఎక్కువగా అధిగమించే వ్యక్తిని తనకు ఒక క్రీడాకారుని చూపించండి అంటూ తెలుపుతూ.. ఈరోజు ధోని ఆట అగ్నికి ఆజ్యం పోసేలా ఉందని తెలిపారు. ఇక చివరగా తన పేరును కాస్త ‘మహి-ంద్ర’గా ఉండడం సంతోషంగా ఉన్నట్టు తెలిపాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments