NTV Telugu Site icon

Deverakonda Brothers: అన్న‌య్య పుట్టిన రోజున ఎమోష‌న‌లైన తమ్ముడు.. పోస్ట్ వైరల్..

Vijay Devarakonda

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి పాన్-ఇండియన్ హీరోగా మారాడు. ఇక విజయ్ ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. చివరిసారిగా “ఫ్యామిలీ స్టార్” సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈరోజు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, విజయ్ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Plane Skid: ఘోరప్రమాదానికి గురైన బోయింగ్‌ విమానం.. వీడియో వైరల్..

విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌తో అన్నకు శుభాకాంక్షలు తెలిపారు. వారి చిన్ననాటి ఫోటోలను పంచుకున్నాడు. జన్మదిన శుభాకాంక్షలు అన్న.. ఎలా జీవించాలో నువ్వు నాకు ఓ సజీవ ఉదాహరణ. మీ నుండి బలం, క్రమశిక్షణ, విశ్వాసం, నిజాయితీ.. ఇలా చాలా నేర్చుకోవచ్చు. మీరు పడిపోయిన ప్రతిసారీ, మీరు చాలా బలంగా తిరిగి వస్తారని ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియా తరుపున విషెస్ తెలిపాడు.

Also Read: Plane Skid: ఘోరప్రమాదానికి గురైన బోయింగ్‌ విమానం.. వీడియో వైరల్..

ఇదిలా ఉంటే… ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన చేయబోయే సినిమాల విశేషాలను పంచుకున్నారు. అతని చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తాత్కాలికంగా VD12 అని పేరు పెట్టారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రవికిరణ్ కోలా దర్శకత్వం, దిల్ రాజు నిర్మాతగా వహించిన 59వ చిత్రం. అదనంగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మూడవ చిత్రం VD14 అనే తాత్కాలిక టైటిల్‌ తో సినిమా చేయబోతున్నారు.

Show comments