Site icon NTV Telugu

Gam Gam Ganesha X Review: ఆనంద్‌ దేవరకొండ ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే?

Gam Gam Ganesha X Review

Gam Gam Ganesha X Review

Anand Devarakonda’s Gam Gam Ganesha Twitter Review: ఆనంద్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్‌ బొమ్మిశెట్టి తెరకెక్కించిన సినిమా ‘గం.. గం.. గణేశా’. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్స్. ఈ చిత్రం నేడు (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బేబీ’ సినిమా హిట్ కొట్టడంతో.. ‘గం.. గం.. గణేశా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు చోట్ల షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్‌ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Also Read: Anjali-Balakrishna: బాలకృష్ణపై ఆసక్తికర ట్వీట్.. అంజలి ఏం ఎన్నారంటే?

‘గం.. గం.. గణేశా’కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఎక్స్‌లో ఎక్కువగా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. కామెడీ బాగా వర్కౌట్‌ అయిందని ప్రేక్షకులు కామెంట్‌ చేస్తున్నారు. ఆనంద్‌ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందని అంటున్నారు. ‘యూకే రివ్యూలు బాగున్నాయి. ఆనంద్‌ ఖాతాలో మరో హిట్’, ‘ఫన్నీ క్రైమ్ కామెడీ చిత్రం. కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. వెన్నల కిషోర్ ట్రాక్ బాగుంది’, ‘ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. ఆనంద్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు’, ‘కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజీ’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Exit mobile version