Production No 32 : #90స్ కి సీక్వెల్ సిద్ధం… హీరో ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Production No 32 : ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది. టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియెన్స్ ఎగబడి చూస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో రిలీజైన ఈ సిరీస్.. సరికొత్త రికార్డుని సాధించింది. ఆ సంవత్సరం భారతదేశంలోని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించిన తెలుగు సిరీస్‌గా ఇది నిలిచింది. #90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్‌కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం నిర్మించిన ఈ సిరీస్‌లో శివాజీ, వాసుకీ ఆనంద్, రోహన్, వాసంతిక, మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Also:Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత..
Also Read
- Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
‘బేబీ’ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. అలాగే ’90s’ వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తమ ప్రొడక్షన్ నెం. 32ని సగర్వంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. ’90s’ సిరీస్ లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు.
Read Also:Sankrantiki vastunnam : వెంకీ మామ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్.. ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందంటే
“మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ.” అంటూ వీడియో చివర్లో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుంది. తన మధురమైన మెలోడీలతో ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి, ’90s’ సిరీస్ లో తన అసాధారణ ప్రతిభతో ప్రశంసలు పొందిన ఛాయాగ్రాహకుడు అజీమ్ మొహమ్మద్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
-
Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
-
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
-
Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!