Site icon NTV Telugu

Anakapalli: ప్రేమ పరువు హత్య..? లవర్, ఆమె తల్లితో కలిసి అరుణాచలం వెళ్లిన యువకుడు.. అంతలోనే..

Anakapalli

Anakapalli

Anakapalli District: అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య కేసు కలకలం సృష్టిస్తోంది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఈ అంశంపై తాజాగా ప్రత్యక్ష సాక్షి మృతుడు నవీన్ మేనమామ ఎన్టీవీతో మాట్లాడారు. వేకువ జామున తమకు ఓ కాల్ వచ్చిందని.. ఆ కాల్‌లో నవీన్ చనిపోయాడని తమకు  చెప్పినట్లు వెల్లడించారు. “ట్రూ కాలర్ లో రూప అనే పేరు మీద ఆ నెంబర్ ఉంది.. మా మేనల్లుడు నవీన్ మేడ పైనుండి దూకి చనిపోయాడని చెప్పారు. రూపాతో మాట్లాడితే ఏడుస్తుంది తప్ప ఇంకేం మాట్లదట్లేదు. ఎవరో అబ్బాయిలు మాట్లాడరు, చెన్నయ్ రా చూసుకుందాం అని మెసేజ్ పెట్టారు. ఇంట్లో నుంచి పదో తరగతి స్నేహితులతో సింహాచలం వెళ్తానని బయలుదేరిన నవీన్.. అరుణాచలం ఎందుకు వెళ్లాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రేమించిన యువతి ఆమె తల్లితో కలిసి నవీన్ అరుణాచలం వెళ్ళినట్టు ట్రైన్ టికెట్లు ఉన్నాయి. వాళ్ళే తీసుకెళ్ళి హత్య చేయించి ఆత్మ హత్య చేసుకున్నాడని అబద్ధాలు చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే నవిన్ బాడిపై కొట్టినట్లు, కత్తితో గాయపరిచి నట్లు ఎందుకు గాయాలు ఉన్నాయి?” అని ప్రశ్నించారు.

READ MORE: rashanth Reddy : రైతు ప్రభుత్వం అంటూ రైతులను ముంచుతున్నారు

ఈ ఘటనపై పూర్తి స్ధాయిలో దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, నవీన్ రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి, వారు నవీన్‌ను అరుణాచలానికి తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగినదో తెలియదు, తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది. ఇక, నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను నవీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. నవీన్‌ను తల్లి కూతుళ్లు ఇద్దరు ప్రేమించిన పాపానికి దారుణంగా హత్య చేసి, అనుమానాస్పద మృతి కేసుగా తప్పుదోవ పట్టించడం జరుగుతున్నట్లు వారు ఆరోపించారు.

Exit mobile version