Site icon NTV Telugu

Anakapalle Movie Teaser: సమ్మర్ బరిలో ‘అనకాపల్లి’.. టీజర్ చూశారా!

Anakapalle

Anakapalle

Anakapalle Movie Teaser: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడుతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి’ అంటూ సాగే పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో టీజర్ ఊర మాస్‌గా స్టార్ట్ అవుతుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, యూత్‌ను ఆకట్టుకునే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ కూడా ఈ టీజర్‌లో సమపాళ్లలో ఉన్నాయి.

READ ALSO: Chicken Price: చికెన్ షాపుల ముందు క్యూ కట్టిన జనాలు.. కారణం ఇదే..

సాధారణంగా సినిమాలకు దర్శకత్వం వహించే త్రినాథరావు నక్కిన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. విక్రమ్ సహిదేవ్ తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో ఈ ‘రా అండ్ రస్టిక్’ పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. దేవ్ జండ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మాయా.వి విజువల్స్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. ఈ చిత్రంలో తారక్ పొన్నప్ప, ఇంద్రజ, మహబూబ్ బాషా, నందిని రాయ్ వంటి నటీనటులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ సీజన్‌లోనే థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

READ ALSO: Nepal Education Revolution: విద్యార్థి సంఘాలకు షాక్.. క్యాంపస్‌ల నుంచి రాజకీయాలు అవుట్.. 60 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే!

Exit mobile version