Site icon NTV Telugu

Anagani Satyaprasad: ప్రచార ఆర్భాటమే.. మహిళలకు రక్షణేది?

రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై అత్యాచారాన్ని ఖండిస్తున్నా. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో మహిళలపై రోజుకో అత్యాచారం.. పూటకో హత్య జరుగుతున్నాయన్నారు టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. రేపల్లెను గంజాయి హబ్ గా తయారు చేశారు.గంజాయి తాగి మహిళను గ్యాంగ్ రేప్ చేసారు అంటే ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి అనే దానికి అద్దంపడుతుంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీ బీహార్ గా మారింది. దిశా చట్టం అంటూ మహిళా మంత్రులు మైకులు పట్టుకుని చెప్తున్నారు.ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేదు.రైల్వే స్టేషన్, బస్టాండ్లల్లో రక్షణ లేదు.ప్రభుత్వ ప్రచారం ఆర్బాటాలకే పరిమితం అవుతుందని దుయ్యబట్టారు ఎమ్మెల్యే సత్యప్రసాద్.

ప్రకాశం జిల్లా దళిత అమ్మాయిపై రేపల్లెలో గ్యాంగ్ రేప్ జరగడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు టీడీపీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివ రావు, ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఏపీని గంజాయి వనంగా ప్రభుత్వం మార్చింది.ఏపీలో పిచ్చి మద్యం,గంజాయి తాగి మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారు.వలస కూలీలులాగా మహిళలు త్వరలో ఏపీ నుంచి పక్క రాష్ట్రాలు వెళ్లే పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తుంది.ఏపీలో 1000 రోజుల జగన్ పాలనలో 1000 మంది మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరిగాయని విమర్శించారు.

Akkineni Nagarjuna: నాగార్జునకు ఏమైంది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

Exit mobile version