Marriage: ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని ఓ మామ పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్(78) దంపతులకు నలుగురు సంతానం. పన్నెండేళ్ల క్రితం కైలాశ్ యాదవ్ భార్య చనిపోవడంతో కొడుకుల వద్దనే ఆయన నివసిస్తున్నాడు. అందరూ వివాహాలు చేసుకుని ఎవరికి వారు జీవిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం కైలాశ్ భార్య మృతి చెందింది. కైలాశ్ యాదవ్ బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
Attack With Knife: ప్రేమను నిరాకరించిన యువతి.. కత్తితో కిరాతకంగా గొంతుకోసిన యువకుడు
అయితే కొన్నేళ్ల క్రితం కైలాశ్ మూడో కుమారుడు మరణించారు. కొడుకు మరణించడంతో కోడలు పూజ(28) ఒంటరిగా మారింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక గుడిలో పూజ నుదుట సింధూరం దిద్ది కైలాశ్ యాదవ్ గుడిలో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఇద్దరి వివాహానికి బంధుమిత్రులు కూడా అంగీకరించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు తెలిసింది.అయితే, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి తెలిపారు.