NTV Telugu Site icon

Attempt to Murder: భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..

Fire

Fire

Attempt to Murder: రానురాను ప్రజలలో క్రూరత్వవం ఎక్కువతుంది. కొందరైతే.. ఆస్తి కోసం సొంతవారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడడం లేదు. ఇకపోతే, తాజాగా రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది తన రెండో అక్క. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మహిళపై పెట్రోల్ పోసి అక్క అల్లుళ్ళు, అక్క కొడుకు హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అదృష్టం కొద్దీ పెట్రోల్ వాసన రావడంతో గమనించి బయటకు పరుగులు తీసింది లక్ష్మీ. అయితే ఈ ఘటనలో ఆమె కప్పుకున్నదుప్పటి కాలిపోయింది.

Harish Rao: రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి..

ఇకపోతే., బాధితురాలు లక్ష్మీ భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తుంది. తల్లిదండ్రుల ఎకరం భూమిలో వాటా కోసం ముగ్గురూ అక్కచెల్లెళ్ల మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మీని చంపేస్తే భూమి తాము తీసుకోవచ్చని ప్లాన్ వేసి ఇద్దరు అల్లుళ్ళు, కొడుకుతో కలిసి స్కెచ్ వేసింది రెండో అక్క. జరిగిన సంఘటనకు సంబంధించి బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇందులూ సంబంధించి పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.

Saripodhaa Sanivaaram: నాని సినిమా లైన్ లీక్.. ఆ బ్లాక్ బస్టర్ కథతోనే?

Show comments