NTV Telugu Site icon

Rajasthan: కోటా హాస్టల్స్లో ఆత్మహత్యలను తగ్గించేందుకు వినూత్న ఆలోచన..!

Kota

Kota

రాజస్థాన్ లోని కోటా విద్యా కేంద్రంలో ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది పిల్లలు వస్తుంటారు. ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లకు చెందినవారే ఉంటారు. అయితే కోటాలో చేరిన ప్రతి పిల్లవాడు ఇంజనీర్, డాక్టర్ అవ్వలేడు. దీంతో కొందరు పిల్లలు ఒత్తిడి, నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పిల్లల ఆత్మహత్యలు అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. గత ఏడాది 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సారి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Paluke Bangaramayena: జానకి కలగనలేదు కానీ.. పలుకే బంగారమాయెనా..?

కోటాలో అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) నివాసాల్లో స్ప్రింగ్‌లోడెడ్ ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ చర్య ఆత్మహత్య కేసులను నిజంగా ఆపివేస్తుందా అని నెటిజన్లు అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎక్కువగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలే ఉండటంతో.. అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. ఏమాత్రం బరువు పడినా వెంటనే ఊడివచ్చేలా ఫ్యాన్లను అమర్చారు.విద్యార్థుల మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నించాలి కానీ.. సీలింగ్ ఫ్యాన్లు కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Bihar: వృద్ధ దంపతులను చంపేసి.. మృతదేహాలను హైవేపై 500 మీటర్లు ఈడ్చుకెళ్లి..

ఈ వీడియోను ANI ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించడానికి కోటలోని అన్ని హాస్టళ్లలో మరియు పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాలలో స్ప్రింగ్-లోడెడ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వార్త రాసే సమయానికి 45 వేలకు పైగా వ్యూస్, ఐదు వందలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాకుండా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు దీనిని ప్రశంసనీయమైన చర్యగా అభివర్ణించగా, చాలామంది దీని నుండి ఏమి జరుగుతుందో, విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు.