ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు దిగుతున్నారు. భారతీయ ఆఫీసులు, భారతీయ పౌరులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగిస్తున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్ సహా వివిధ దేశాల్లో గతకొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆయా ఘటనలతో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా దేశాల రాయబారులు, ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరుతుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఓ ఇండియన్ స్టూడెంట్ పై ఖలిస్థానీ మద్దతుదారులు తీవ్రంగా కొట్టారు.
Read Also: Nayakudu Review: నాయకుడు రివ్యూ
సిడ్నీ నగరంలో మంగళవారం తనపై ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడి చేసినట్లు భారత్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపాడు. వెస్టర్న్ సిడ్నీలోని వెస్ట్‌మేడ్ ఏరియాలో దాదాపు 7, 8 మంది ఖలిస్థానీ మద్దతుదారులు తనను విచక్షణా రహితంగా కొట్టారని అతడు పేర్కొన్నాడు. తనపై దాడి చేస్తున్న.. సమయంలో ఆ మూక ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిందని చెప్పుకొచ్చాడు. ఇనుప రాడ్లతో తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని.. బాధితుడు వెల్లడించాడు.
Read Also: Allu Sirish: ఆ హీరోయిన్ తో అల్లు శిరీష్ ప్రేమాయణం..?
తాను చదువుకుంటూ పార్ట్‌టైమ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు ఆ బాధితుడు పేర్కొన్నాడు. మంగళవారం ఉదయం 5. 30 గంటలకు తాను బయటికి వచ్చినట్లు వెల్లడించాడు. తాను ఉంటున్న ఇంటి నుంచి కారును 50 మీటర్ల దూరంలో పార్క్ చేసినట్లు పేర్కొన్నాడు. తాను వెళ్లి కారులో కూర్చోగానే 7 , 8 మంది వ్యక్తులు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారని ఆ విద్యార్థి చెప్పాడు. ఇనుప రాడ్లతో తన మొహంపై కొట్టి.. అనంతరం తనను కారులో నుంచి కిందికి లాగి పడేసి విచక్షణారహితంగా దాడి చేశారని వెల్లడించాడు. నలుగురైదుగురు తనను కొడుతుంటే మరో ఇద్దరు, ముగ్గురు అన్ని వైపుల నుంచి తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారని చెప్పాడు. తనను కొడుతున్నంత సేపు వారు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ మళ్లీ మళ్లీ నినాదాలు చేశారని అతడు పేర్కొన్నాడు.
