Site icon NTV Telugu

Nellore: మైనర్ విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం..

Rape

Rape

మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండాపోతుంది. యేడాదికేడాది హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం మహిళలు, బాలికలకు వేధింపులు తప్పడం లేదు. పురుషాధిక్య సమాజంలో ఆమె ఒక సమిధగా మారుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మైనర్‌ బాలికలపై అత్యాచార ఘటనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..

READ MORE: Asteroid: భూమికి ప్రమాదం.. గ్రహశకలం ఢీకొట్టే అవకాశం..

నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలో చదివే మైనర్ బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లి దండ్రులు ప్రశ్నించారు. దీంతో అత్యాచారం వ్యవహారాన్ని బాలిక వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

READ MORE: Rohit Sharma: రోహిత్ శర్మ తుఫాను ఇన్నింగ్స్.. హిట్‌మ్యాన్‌ పేరిట మరో రికార్డ్

Exit mobile version