Site icon NTV Telugu

Mohan Babu: మోహన్‌బాబు ఆరోగ్యంపై కీలక ప్రకటన.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Mohan Babu

Mohan Babu

మోహన్‌బాబు ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రి బీపీ పెరగడంతో పాటు.. కంటి కింద, కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం కార్డియోలజీ, జనరల్ ఫిజీసియన్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రి యాజమాన్యం అనుమతి తరువాత మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు. అయితే ఇవ్వాళ రాచకొండ సీపీ యెదుట హాజరుకావాల్సి ఉండగా… మోహన్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..హెల్త్ బులిటెన్ అనంతరం మోహన్ బాబు సీపీ ముందు హాజరు అవుతారా? లేదా? అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

READ MORE: Crime News: రాజమహేంద్రవరం జైలులో ఖైదీకి చిత్రహింసలు!

కాగా.. జల్పల్లిలో జరిగిన ఘటనపై సీపీ స్వయంగా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక జల్‌పల్లి లో జరిగిన దాడి ఘటనపై రాచకొండ సీపీ సీరియస్ అయినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఇక ఇప్పటికే మంచు మోహన్ బాబు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకు చెందిన లైసెన్స్ గనులను పోలీసులు సీజ్ చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందారు మోహన్ బాబు, విష్ణు. వీరిద్దరి గన్ లైసెన్సులను సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది.

READ MORE: Manchu Family: జల్‌పల్లి నివాసంలో మనోజ్, మౌనిక.. ఆస్పత్రిలో విష్ణు, మోహన్ బాబు.. విచారణకు హాజరవుతారా?

Exit mobile version