NTV Telugu Site icon

Chhattisgarh: యుపీలో తోడేళ్లు.. ఛత్తీస్‌గఢ్‌లో అయిదుగురిని పొట్టన బెట్టుకున్న గజరాజు

Elephant

Elephant

ఓ వైపు యూపీలో తోడేళ్లు జనజీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి. వాటి దాడిలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత 30 రోజుల్లో అడవి ఏనుగుల దాడిలో ఐదుగురు మరణించారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో 65 ఏళ్ల వృద్ధ మహిళపై అడవి ఏనుగు దారుణంగా దాడి చేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఏనుగులు జనావాల వద్దకు చేరి ప్రజలను చితక్కొట్టడం ప్రారంభించాయి. వీటి దాడిలో గత నెలలో ఐదుగురు మరణించారు. బాల్కో ఫారెస్ట్ రేంజ్‌లోని బాగ్మారా గ్రామ సమీపంలో జరిగిన తాజా ఘటనలో రెండు ఎద్దులు కూడా మరణించాయి.

READ MORE: Duleep Trophy: 7 వికెట్లు, 7 మెయిడిన్లు.. విరుచుకుపడ్డ బౌలర్, ఇంతకీ ఎవరు..?

శుక్రవారం రాత్రి గ్రామానికి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఓ గుడిసెలో ఉన్న మహిళ భలై బాయి, ఆమె భర్తపై ఏనుగు దాడి చేసిందని కోర్బా అటవీ డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అరవింద్ పీఎం తెలిపారు. ఆ సమయంలో ఇద్దరూ నిద్రపోతున్నారు. భలాయి బాయి భర్త అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు. కానీ ఏనుగు అతని భార్యను తొక్కి చంపేశాయి. దీని తరువాత, ఈ అడవి ఏనుగు రెండు ఎద్దులపై కూడా దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుటుంబానికి రూ.25వేలు ఆర్థిక సాయం చేశామని, మిగిలిన రూ.5.75 లక్షలు విధిగా చెల్లిస్తామని అటవీశాఖ అధికారి తెలిపారు. అదే ఏనుగు సెప్టెంబర్ 4న కోర్బా జిల్లాలోని కత్ఘోరా ఫారెస్ట్ డివిజన్‌లో ఒక వృద్ధుడిని, ఆగస్టు 8న కత్ఘోరా ఫారెస్ట్ డివిజన్‌లోని వేర్వేరు ప్రదేశాలలో ముగ్గురు మహిళలను చితకబాది చంపడం గమనించదగ్గ విషయం.