NTV Telugu Site icon

Earthquake: హర్యానాలో భూకంపం.. భయంతో జనాలు పరుగులు

Shd

Shd

హర్యానాలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.2గా నమోదైంది. సాయంత్రం 6:10 గంటలకు హర్యానాలోని సిర్సాలో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఇదిలా ఉంటే భూప్రకంపనలకు ప్రజలు భయపడ్డారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

ఇది కూడా చదవండి: Mrunal Thakur: సరైన తోడు దొరకడం కష్టమే.. సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్?

హర్యానాలోని దబ్వాలీకి నైరుతి దిశలో 11 కి.మీ దూరంలో ఈ భూకంపం సంభవించినట్లుగా అధికారులు గుర్తించారు. భూప్రకంపనలు సంభవించగానే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ భూప్రకంపలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏమైనా ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది.