NTV Telugu Site icon

Japan: జపాన్‌లో భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ!

Earthquake

Earthquake

జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. నైరుతి జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఎంతమేర నష్టం జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం క్యుషు నైరుతి ద్వీపంలో ఉంది. మియాజాకి ప్రిఫెక్చర్‌తో పాటు పక్కనే ఉన్న కొచ్చి ప్రిఫెక్చర్‌కు సునామీ హెచ్చరిక జారీ చేశారు.

READ MORE: YS Jagan: తెలుగు ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు..

యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. భూకంపం 37 కి.మీ లోతులో సంభవించింది. ఆగస్టు 8, 2024న జపాన్‌లో 6.9 మరియు 7.1 తీవ్రతతో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. దీని ప్రభావం క్యుషు, షికోకులలో ఎక్కువగా కనిపించింది. అధికారులు అనేక ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం గురించి నివేదికలు లేవు.

READ MORE: Delhi: కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. హాజరైన ప్రధాని

పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్‌ల ఆర్క్ అయిన “రింగ్ ఆఫ్ ఫైర్” వెంబడి ఉన్నందున జపాన్ తరచుగా భూకంపాలకు గురవుతుంది. 2004లో జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన తర్వాత సునామీ వచ్చింది. ఈ సునామీ జపాన్‌ను ఎంతగానో బాధించింది. నేటికీ ప్రజలు దానిని మరచిపోలేకపోతున్నారు. డిసెంబర్ 26, 2004న సంభవించిన భూకంపం తర్వాత వచ్చిన సునామీ కారణంగా జపాన్‌లో వేలాది మంది మరణించారు.

 

Show comments