NTV Telugu Site icon

Crime: అరెస్ట్ భయంతో ఇంటి నుంచి పారిపోయిన ఆప్ ఎమ్మెల్యే, అతడి కుమారుడు

Noida Mla

Noida Mla

పెట్రోల్ పంప్ వర్కర్‌పై దాడి చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని కుమారుడు అనాస్‌లను అరెస్ట్ చేసేందుకు నోయిడా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా నోయిడా పోలీసులు అమానతుల్లా ఖాన్ ఇంటికి చేరుకోగా.. అతను ఇంట్లో కనిపించలేదు. గురువారం నుంచి పోలీసులు అమానతుల్లా ఖాన్, అతని కొడుకును వెతికుతున్నారు. అరెస్టు భయంతోనే ఎమ్మెల్యే, ఆయన కుమారుడు పరారీలో ఉన్నారని తెలిపారు. మూడు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. నిందితులకు వ్యతిరేకంగా కోర్టు NBW కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఇద్దరికి సంబంధించిన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి.

READ MORE: Road Accident: ప్రకాశం జిల్లాలో బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు!

కాగా.. ఇటీవల పెట్రోల్‌ పంపు వద్ద ఎమ్మెల్యే కుమారుడు అనాస్‌ దాడికి పాల్పడ్డాడు. పెట్రోల్ పంప్ ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో, నోయిడా పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని కుమారుడు ఆవాస్ పై ఐపీసీ సెక్షన్ 323, 504, 506, 427 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అబూ బకర్‌పై అనే వ్యక్తిని కూడా నిందితుడి కిందికి చేర్చారు. వారికి నోయిడా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అంతకుముందు, నోయిడా పోలీసులు నోటీసు ఇవ్వడానికి శనివారం అమానతుల్లా ఖాన్ ఇంటికి చేరుకున్నారు. అయితే, చాలా రోజులుగా అతని కొడుకుతో పాటు ఇంటి నుంచి పారిపోయారు. దీంతో నోయిడా పోలీసులు ఇంటి వద్ద నోటీసును అతికించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కుమారుడు ఉదయం 9:27 గంటలకు బ్రెజ్జా కారులో పెట్రోల్ కోసం వచ్చాడు. క్యూలో రాలేదు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి లైన్ లో రమ్మని అతడికి సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు దుర్భాషలాడాడు, ముందు తన కారులో పెట్రోల్ వేయమని అడిగాడు ఆవాస్. ఉద్యోగిని బెదిరించడం, కొట్టడంతోపాటు అక్కడ ఉంచిన కార్డు మిషన్‌ను కూడా పగలగొట్టాడు. సీనియర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయానికి పెట్రోల్ పంప్ మేనేజర్‌తో మాట్లాడటానికి ఎమ్మెల్యే అమానుతల్లా ఖాన్‌ వచ్చారు. పెట్రోల్ పంపు యజమాని బెదిరించారు. దీంతో ఫిర్యాదు చేశారు.