Site icon NTV Telugu

Amy Jackson Wedding: ఘనంగా హీరోయిన్ అమీ జాక్సన్‌ పెళ్లి.. వెడ్డింగ్‌ పిక్స్‌ వైరల్!

Amy Jackson Wedding

Amy Jackson Wedding

Amy Jackson and Ed Westwick tie knot in Italy: హీరోయిన్ అమీ జాక్సన్‌, హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఆదివారం ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. తాము పెళ్లి చేసుకున్నామని అమీ, వెస్ట్‌విక్‌లు తమ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ఇరువురు తమ వెడ్డింగ్‌ పిక్స్‌ పోస్ట్‌ చేసి.. ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అని పేర్కొన్నారు.

ఇటలీకి వెళ్లే ముందు ఎడ్‌ వెస్ట్‌విక్‌తో కలిసి విమానంలో వెళుతున్న పోటోలను అమీ జాక్సన్‌ షేర్ చేశారు. ఆ ఫొటోలకు ‘పెళ్లి చేసుకుందాం బేబీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. అమీ కొడుకు ఆండ్రియాస్ ఆమెతో పాటే ఉన్నాడు. వివాహానికి ముందు ఈ జంట విలాసవంతమైన యాచ్‌లో ప్రీ-వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు. అమీ, వెస్ట్‌విక్‌లు గత జనవరిలో స్విట్జర్లాండ్‌లోని జిస్టాడ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2022లో సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్‌లో వెస్ట్‌విక్‌ను అమీ తొలిసారి కలిశారు. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

గతంలో జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. కొంతకాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంటకు బాబు (ఆండ్రూ) జన్మించాడు. 2020లో వివాహం చేసుకోవాలనుకోగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇక అమీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎవడు, ఐ, 2.ఓ చిత్రాల్లో నటించారు.

Exit mobile version