NTV Telugu Site icon

Bigg Boss-Amrutha Pranay: బిగ్‌బాస్‌లోకి అమృత ప్రణయ్!

Amrutha Pranay

Amrutha Pranay

Is Amrutha Pranay in Bigg Boss Telugu 8: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో ‘బిగ్‌బాస్‌’ ఒకటి. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో ఏడు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుంది. తాజాగా సీజన్ 8 ప్రోమోను ‘స్టార్ మా’ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 1న కొత్త సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో న్యూస్ నెట్టింట వైరల్ అయింది.

బిగ్‌బాస్‌ తెలుగు 8లోకి అమృత ప్రణయ్ అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌లోకి వచ్చేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో అమృత చాలా చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు సంబందించిన విషయాలను పోస్ట్ చేస్తుంటారు. బెదురులంక 2012 సినిమా ప్రమోషనల్‌లో హీరో కార్తీకేయతో డాన్స్ చేయడంతో.. అమృత సినిమాల్లోకి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు.పరువు హత్య ఘటనలో అమృత ప్రణయ్‌ పేరు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే.

Also Read: Raj Tarun: సినిమా షూటింగ్‌లో అస్సలు నాన్ వెజ్జే పెట్టలేదట!

2018 సెప్టెంబర్ 14న తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యతో అమృత, ప్రణయ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ప్రణయ్ అనే దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో.. అమృత తండ్రి మారుతీరావు అత్యంత దారుణంగా ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. ప్రణయ్ చనిపోయే నాటికి గర్భిణిగా ఉన్న అమృత.. కొన్నాళ్లకు పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె ప్రణయ్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ.. కొడుకుతో ఆనందంగా జీవిస్తున్నారు.

Show comments