ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ గుర్తింది కదా.. ఈ ఆంథాలజీ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది.ఇందులోనే మరో స్టోరీలో ప్రముఖ నటి అమృతా సుభాష్ కూడా కొన్ని ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయి నటించింది..ఈ ఆంథాలజీలో ఆ ఎపిసోడ్ కు మరో బాలీవుడ్ నటి కొంకణాసేన్ శర్మ డైరెక్ట్ చేసింది. అయితే ఈ సీన్లు చేయడానికి తాను ఇబ్బంది పడినా కూడా తన భర్తే నువ్వు చేయగలవంటూ ఎంకరేజ్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.నెట్‌ఫ్లిక్స్ యాక్టర్స్ రౌండ్ టేబుల్లో అమృతా సుభాష్ కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. లస్ట్ స్టోరీస్ 2లో ఆమె భర్త పాత్రను శ్రీకాంత్ యాదవ్ పోషించాడు. అతడు చాలా ఏళ్లుగా తన బెస్ట్ ఫ్రెండ్ అని, అలాంటి వ్యక్తితో తాను ఇంటిమేట్ సీన్లు చేయాలి అనగానే మొదట తాను భయపడినట్లు చెప్పింది..
అమృత సుభాష్ మాట్లాడుతూ “నేను స్క్రిప్ట్ చదవగానే అందులో చాలా ఇంటిమేట్ సీన్లు ఉన్నాయనిపించింది. వాటిని చూసి భయపడ్డాను. ఆ సీన్లు చేయడానికి ముందు ఒక రోజు శ్రీకాంత్ తో గడపాలని అనుకుంటున్నట్లు కొంకణాతో చెప్పాను. ఇందులో నా భర్త పాత్ర పోషించిన శ్రీకాంత్ యాదవ్ చాలా ఏళ్లుగా నా బెస్ట్ ఫ్రెండ్. అతడు నా భర్తకు కూడా ఫ్రెండే.అలాంటి వ్యక్తితో ఇలాంటి సీన్లంటే ముందు భయపడ్డాను.. అటు శ్రీకాంత్ యాదవ్ కూడా నీతో ఇలాంటి సీన్లు చేయలేనని అన్నాడు. అప్పుడు నా భర్తే నువ్వు చేయగలవంటూ నన్ను ప్రోత్సహించాడు. ఆ తర్వాత షూటింగ్ కు ముందు ఒక రోజంతా కొంకణా సేన్ బెడ్ రూమ్ లో మేము గడిపాము. అన్ని యాంగిల్స్ లో ఎలా ఉంటుందో కూడా చూసుకున్నాం. మాతోపాటు సినిమాటోగ్రాఫర్ కూడా ఉన్నాడు” అని అమృతా సుభాష్ చెప్పుకొచ్చారు .నెట్‌ఫ్లిక్స్ యాక్టర్ రౌండ్ టేబుల్లో అమృతతోపాటు కరీనా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, సాన్యా, తిలోత్తమ మరియు జైదీప్ అహ్లావత్ లాంటి నటీనటులంతా పాల్గొన్నారు.
