Site icon NTV Telugu

Viral News : ఫార్చ్యూనర్‌ కారులో వచ్చి.. పార్కింగ్ చేసి రోడ్డుపై చిప్స్ అమ్మాడు

New Project (75)

New Project (75)

Viral News : ఏ పనీ చిన్నదని కాదు.. ఆలోచన ఉంటే ఒకప్పటి చిన్న పనే కొన్నాళ్లు గొప్ప భవిష్యతును తీసుకొస్తుంది. ఎవరి ముందైనా చేయి చాచడం కంటే రోడ్డుపక్కన బండి పెట్టుకొని బతకడం మంచిదని కూడా పెద్దలు చెబుతుంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా పూర్తిగా మారిపోయారు. ఈ రోజుల్లో వీధి వ్యాపారులు కూడా గొప్పగా సంపాదిస్తున్నారు. కొందరు కార్పోరేట్ ఉద్యోగుల జీతం కంటే పదిరెట్లు ఎక్కవగా సంపాదించే వారున్నారు. అటువంటి బండి విక్రేత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాన్ ఖాటై(నెయ్యి బిస్కట్లు) అమ్మకం దారుడు రూ.50 లక్షల ఫార్చ్యూనర్‌ కారును కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు.

Read Also:Lavu Sri Krishna Devaraya: ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌కి నిజమైన వారసుడు చిరంజీవి.. వారిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయొద్దు..

ఇలాంటి వీడియోలు ఇది వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ ఈ రోడ్‌సైడ్ కార్మికులు తమ సంపాదనను వెల్లడించారు. దీని గురించి తెలుసుకున్న ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులు చదువుకున్న వారి కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇప్పుడు తాజాగా పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు. అందులో అతను అమృత్‌సర్ వీధుల్లో నాన్ ఖాటై విక్రయించి అతను యాభై లక్షల విలువైన ఫార్చ్యూనర్‌లో తిరగగలిగే స్థాయికి వచ్చాడు. ఓ వ్యక్తి రోడ్డు పక్కన నాన్ ఖతాయ్ విక్రయిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఫార్చ్యూనర్ కారు వెనుకనే పార్క్ చేసి ఉంది. ఒక కస్టమర్ అతని వద్దకు వచ్చి ఈ కారు మీదా అని అడిగితే అవును అది నాదే అని చెప్పాడు. ఆ వ్యక్తి నమ్మకపోవడంతో కారు తాళాలు కూడా చూపించాడు. తాను గత ఐదేళ్లుగా నాన్ ఖాటై విక్రయిస్తున్నట్లు తెలిపాడు. నేను ఖతాయ్‌ను కిలో రూ.200కి విక్రయిస్తానని చెప్పాడు. ఆ వీడియోని ఇన్‌స్టాలో ఆఫీసర్‌సాహిహై అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా లైక్ చేసి, కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

Read Also:Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రత్యేక కానుక..

Exit mobile version