అమృత అయ్యర్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో కూడా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.. హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
రీసెంట్ గా హనుమాన్ చిత్రంలో నటించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలో అమృత అందాలకు ఫిదా అయిన కుర్రాళ్ళు ఆమె కోసం తెగ వెతికేస్తున్నారు.. ఈ అమ్మడు పుట్టింది తమిళనాడు లో అయిన పెరిగింది మాత్రం కర్ణాటకలో చదివిన అమృత తర్వాత మోడలింగ్ పై ఫోకస్ పెట్టింది.. తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తుంది.. లింగా, తెనాలిరామన్, పొక్కిరి రాజా, తేరి వంటి సినిమాల్లో నటించింది.. కానీ అమ్మడుకు పెద్దగా హిట్ టాక్ ను ఇవ్వలేక పోయాయి..
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్‌లో రామ్ పోతినేనికి జోడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా అనుకున్న పేరును తీసుకురాలేదు.. ఆ తర్వాత ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అదే ఏడాది విష్ణు సరసన అర్జున ఫాల్గుణ మూవీలో నటించింది. ఈ ఏడాది హనుమాన్ చిత్రంలో తేజాకు జోడిగా నటించింది.. ఇక తాజాగా బ్లాక్ స్కిన్ ఫిట్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
