అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ రాణాకు (Amravati MP Navneet Rana) బెదిరింపులు మహారాష్ట్రలో కలకలం రేపాయి. చంపేస్తామంటూ వాట్సప్‌లో ఆమెకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ట్ర (Maharashtra)లోని అమరావతి లోక్‌సభ స్వతంత్ర ఎంపీ (Navneet Kaur Rana)కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ వాట్సప్ (Whatsapp)లో ఆడియో సందేశం వచ్చింది. దీంతో ఆమె వ్యక్తిగత సహాయకుడి చేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సందేశం పంపిన వ్యక్తులు ఆమెపై అభ్యంతరకర పదజాలం వాడినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
గత ఆదివారం ఆమెకు మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు పంపిన ఆడియో క్లిప్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌లపైనా అభ్యంతరకర పదాలు ఉపయోగించినట్లు సమాచారం. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అమరావతి (Amravati MP) నుంచి ఎంపీగా (Lok Sabha) పోటీ చేసేందుకు నవనీత్ కౌర్ సిద్ధపడుతున్నారు.
